17May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా అత్తామామలను చంపించేందుకు కోడలు ప్రయత్నించింది. బేగంబజార్ కట్టెల మండీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తామామలను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కోడలు కుట్ర పన్నింది. ఇందుకోసం సుపారీ ఇచ్చి ఒక గ్యాంగ్ కు వారిని హతమార్చేందుకు బాధ్యతను అప్పగించింది.

Update: 2024-05-17 12:52 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : అత్తమామలను చంపేందుకు కోడలు ప్లాన్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం?

బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా అత్తామామలను చంపించేందుకు కోడలు ప్రయత్నించింది. బేగంబజార్ కట్టెల మండీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తామామలను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కోడలు కుట్ర పన్నింది. ఇందుకోసం సుపారీ ఇచ్చి ఒక గ్యాంగ్ కు వారిని హతమార్చేందుకు బాధ్యతను అప్పగించింది.

Rashmika Mandanna : రష్మిక పోస్టును చూసి మోదీ ఎలా రియాక్టయ్యారంటే?

హీరోయిన్ రష్మిక మందన్న సౌత్ ఇండియాలోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లోనూ బిజీగా మారారు. మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. రష్మిక సినిమాలకు మంచి క్రేజ్ నార్త్ లోనూ ఉంటుంది. రష్మిక మందన్నా యానిమల్ సినిమాలో కనిపించి ఉత్తర భారతీయుల మనసును దోచుకుంది. ఇక పుష్ప సినిమా తో కూడా ఆమె మరింత పాపులర్ అయింది. రష్మిక మందన్నా అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో తెలియని వారు లేరు. బాలీవుడ్ లో మంచి అవకాశాలను కూడా సొంతం చేసుకుంటుంది.

Revanth Reddy : డెడ్‌లైన్ దగ్గరపడుతుంది బాసూ... ఇక వేటాడాల్సిందేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు లోపు చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. అతి పెద్ద హామీ రైతు రుణమాఫీ. ఆగస్టు 15వ తేదీలోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే విపక్షాల ట్రాప్ లో పడి చేశారా? లేదా వాస్తవంగా హామీ అమలు చేస్తారో తెలియదు కానీ రేవంత్ అయితే గట్టిగానే హామీ ఇచ్చారు.

Ap Elections : కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక.. జూన్ 19వ తేదీ వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే

కేంద్ర ఇంటలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశముందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. అదనపు కేంద్ర బలగాలను కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించాలని తెలిపింది. ప్రధానంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ అలర్లు చెలరేగే అవకాశముందని పేర్కొంది.

Ap Elections : ఉండి.. ఉండుండి.. ఇలా మారిపోయిందేంటి చెప్మా? నలుగురి రాజుల్లో గెలుపెవరిది?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఇక గెలుపోటములపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్న నియోజకవర్గం ఉండి. ఇక్కడ నలుగురు కీలకమైన నేతలు పోటీ పడుతున్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గం.. రాజ‌కీయంగా టెన్షన్ పెడుతున్న కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఉమ్మడి ప‌శ్చిమ గోదా వ‌రి జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు.. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. షెడ్యూల్ వ‌చ్చేసి.. నామినేష‌న్ల ప్రక్రియ కూడా.. ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ..

మాదాపూర్ లో కారు బీభత్సం...ఒకరు మృతి

మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. పాల వ్యాపారులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ డబ్బంతా పేదలకు పంచి పెట్టాలని ఉంది : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న నగదును పేదలకు పంచిపెట్టాలన్న ఆలోచనలో తాము ఉన్నామని తెలిపారు. ఈడీ దేశంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకుంటుందని, వాటిని పేదలకు పంచిపెట్టాలని, అందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈడీ కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా ఉందని, తమ హయాంలో నల్లధనాన్ని వెతికి తీస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈడీ సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.

Ys Jagan : విదేశీపర్యటనకు సీఎం జగన్.. నేడు కుటుంబ సభ్యులతో కలసి

ఈరోజు విదేశీపర్యటనకు ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన లండన్ పర్యటనకు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కుటుంబ సభ్యులతో విదేశాల్లో గడిపేందుకు ఆయన బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

చార్‌ధామ్‌ యాత్రపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నో ఎంట్రీ

చార్‌ధామ్‌ యాత్ర పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీన చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. పదోతేదీ నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోవడం, భక్తులను అనుమతించడంతో రద్దీ విపరీతంగా ఉంది. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ను తప్పని సరి చేసింది. దీంతో పాటు వీఐపీలు ఎవరూ ఆలయానికి రావద్దని, 31వ తేదీ వరకూ వీఐపీలు ఆలయాన్ని దర్శించకుండా ఉంటే మంచి దని తెలిపింది.

జూనియర్ ఇంటి స్థల వివాదం.. కేసు నమోదు

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం హైకోర్టుకు చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పిటీషన్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News