24May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా మధ్య ఎక్కడో ఒకచోట తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను.. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా మధ్య ఎక్కడో ఒకచోట తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో అరవింద్ యాదవ్ అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో స్థిరపడ్డాడు. అరవింద్ ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సిడ్నీలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 26 తేదీ సాయంత్రానికి మరింత బలపడి తుపానుగా మారనుంది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారినా.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రికీ పాంటింగ్, లాంగర్ చెప్పిందంతా అబద్ధాలేనా?
భారత మెన్స్ క్రికెట్ జట్టు పదవి కోసం తమను సంప్రదించారంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. భారత జాతీయ జట్టు ప్రధాన కోచ్ పాత్ర కోసం తాము ఏ ఆస్ట్రేలియన్‌ని సంప్రదించలేదని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో (USA) జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుండడంతో భారత బోర్డు ఇటీవల కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
అభిమానులతో చర్చలు జరిపిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే విజయ్ కు విజయాలు దూరమవ్వడంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్లతో ముందుకు రావాలని అనుకుంటున్నాడు.
తన పర్సనల్ లైఫ్ గురించి ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేసిన శ్రుతి హాసన్
నటి శ్రుతి హాసన్ ఎట్టకేలకు తన ప్రస్తుత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. తాను ఒంటరిగా ఉన్నానని ప్రకటించింది. శాంతాను హజారికాతో ఆమె ఇటీవల విడిపోయింది. దీనిపై ఆమె అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని ఒప్పుకుంది. శృతి హాసన్ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చించింది. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండల శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిలాక్స్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
KL Rahul: అడ్డంగా ఇరుక్కుపోయిన కేఎల్ రాహుల్
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడం లేదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). భారత తదుపరి ప్రధాన కోచ్ కోసం వేట కొనసాగుతోంది. ఈ పదవికి సంబంధించి హై-ప్రొఫైల్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్న వ్యక్తుల్లో ఒకరైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
TS Inter 2024: నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రాష్ట్రంలో ఇంటర్ 2024 సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. TS ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే 24 నుండి షెడ్యూల్ చేశారు. TS ఇంటర్ 2024 సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్ కార్డ్ అధికారికంగా జారీ చేయబడింది.