సొంత ఊరికి నడచుకుంటూ వెళ్తూ.. బాలిక మృతి

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించారు. దీంతో వలస కూలీలు ఇక్కడ పని లేక, సరైన ఆహారం దొరకక ఎన్నో ఇబ్బందులు [more]

Update: 2020-04-21 12:42 GMT

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించారు. దీంతో వలస కూలీలు ఇక్కడ పని లేక, సరైన ఆహారం దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండడం కంటే తమ స్వస్థలానికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. అలా చాలామంది నడుచుకుంటూ తన సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏటూరునాగారం లో మిర్చి తోట లో పనిచేసే ఒక 12 సంవత్సరాల బాలిక లాక్ డౌన్ ఉండడంతో నడుచుకుంటూ తన స్వస్థలం బీజాపూర్ వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సరైన ఆహారం దొరకక ఆమె చనిపోయింది. మిర్చి తోటలో పని చేసే 12 సంవత్సరాల బాలిక జమ్లా మక్ధం ఏటూరు నాగారం నుండి ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ ( తన స్వస్థలం) నడిచి వెళ్లి చనిపోయిన ఘటన పై మానవ హక్కుల కమిషన్ లో బాలల హక్కుల సంఘం పిటిషన్ వేసింది.

Tags:    

Similar News