ఈనాడులో చంద్రబాబు ఉద్యోగి

చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు ఈనాడుకు ఎన్టీఆర్ ఉపయోగపడ్డారు కాని ఎన్టీఆర్ కు ఉపయోగపడలేదని కొడాలి నాని అన్నారు. [more]

Update: 2019-12-13 03:54 GMT

చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు ఈనాడుకు ఎన్టీఆర్ ఉపయోగపడ్డారు కాని ఎన్టీఆర్ కు ఉపయోగపడలేదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ బొమ్మలేసుకుని ఈనాడు సర్క్యులేషన్ పెంచుకుందన్నారు. వైశ్రాయ్ హోటల్ లో ఆరు మంది ఎమ్మెల్యేలు లేకపోయినా 165 మంది ఉన్నారని ఈనాడులో వేయించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. చంద్రబాబునాయుడు ఈనాడులో ఒక ఉద్యోగి అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేేశారు. నిన్న చీఫ్ మార్షల్స్ పై దౌర్జన్యం చేసిన టీడీపీనేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామారావు నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

పదహారు నెలలు జైల్లో….

జగన్ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారని, తానేమీ చిప్పకూడు తినలేదని టీడీపీ సభ్యుడు రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. తమపై మార్షల్స్ దౌర్జన్యం చేశారన్నారు. దీనికి కొడాలి నాని సమాధానం చెబుతూ కేసుల్లో ఇరికించింది కాంగ్రెస్ ప్రభుత్వమని, జగన్ సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మార్షల్స్ పై చేయిచేసుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీని పందికొక్కుల పార్టీగా మార్చింది చంద్రబాబేనని కొడాలినాని తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News