బాబుకు అల్జీమర్స్ ముదిరిపోయింది

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి బాగా ముదిరిపోయిందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. మూడు రాజధానుల బిల్లులను [more]

Update: 2020-02-28 02:12 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి బాగా ముదిరిపోయిందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో తొక్కి పెట్టడం వల్లనే ఉత్తరాంధ్ర ప్రజలకు ఆగ్రహం వచ్చిందని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబును పార్టీ నుంచి తరిమికొట్టక పోతే వచ్చే ఎన్నికల్లో కనీస స్థానాలు కూడా రావన్న విషయాన్ని గ్రహించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి ముదిరిపోయిందని, ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటరని కొడాలి నాని అన్నారు.

Tags:    

Similar News