ఢిల్లీలోనే తేల్చుకుందాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ఢిల్లీలోనే తేల్చుకోవాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి సెగ తగలదన్నారు. మోదీ [more]
;
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ఢిల్లీలోనే తేల్చుకోవాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి సెగ తగలదన్నారు. మోదీ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ఢిల్లీలోనే తేల్చుకోవాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి సెగ తగలదన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ఆయన ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో పోరాటం చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని నాారాయణ పిలుపు నిచ్చారు.