ప్రధాని హెలీకాఫ్టర్ లోనే డబ్బుల తరలింపు
ప్రధాని నరేంద్ర మోడీ తన హెలీకాఫ్టర్ లోనే డబ్బులు తరలిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… [more]
;
ప్రధాని నరేంద్ర మోడీ తన హెలీకాఫ్టర్ లోనే డబ్బులు తరలిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… [more]
ప్రధాని నరేంద్ర మోడీ తన హెలీకాఫ్టర్ లోనే డబ్బులు తరలిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అభూతకల్పనలు చేశారని, సర్జికల్ స్ట్రైక్స్ ఎవరైనా మాట్లాడితేనే తప్పు చేసినట్లు చూపించారని ఆరోపించారు. భారత్ కు మోడీ ఉత్తమ ప్రధాని అంటూ పాక్ ప్రధాని ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. అంటే ఎవరు పాక్ తో కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గెలుపుపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని… ఈవీఎంలపై పోరాడుతుంటే టీడీపీ ఓడిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈవీఎంలపై ముందునుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు గుర్తుచేశారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇదో పెద్ద మోసమని, దీనిపై దేశమంతా తిరుగుతానని, మళ్లీ కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.