కాల్పుల కేసులో పురోగతి… ఆరు బృందాలతో గాలింపు

కూకట్ పల్లి లోని కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కాల్పులకు పాల్పడింది పాత నిందితులను పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం [more]

Update: 2021-04-30 01:39 GMT

కూకట్ పల్లి లోని కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కాల్పులకు పాల్పడింది పాత నిందితులను పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం జీడి మెట్ల లో జరిగిన దోపిడీ కేసులో వీళ్లకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. జీడిమెట్ల లోని ఒక సెల్ ఫోన్లు దుకాణంలో లో దోపిడీ జరిగింది. తుపాకితో బెదిరించి షాపు యజమాని దగ్గర నుంచి లక్షల రూపాయలతో పాటుగా సెల్ ఫోన్లు ఎత్తుకొని పోయారు. ఆ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఆ సంఘటన నుంచి పోలీసులు తేరుకోక ముందే తాజాగా కూకట్ పల్లి లోని ఏటీఎం సెంటర్ లో కాల్పులకు తెగబడ్డారు . రెండు చోట్ల కాల్పుల చేసిన వారు ఒకరేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు . ఎటిఎం సెంటర్ లో దోపిడీకి పాల్పడి ఒక్కరి మృతి నిందితులు కారణమయ్యారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దించారు . కూకట్ పల్లి లోని హెచ్.డి.ఎఫ్.సి ఎటిఎం సెంటర్ లో దోపిడీకి చేశారు. ఈ సమయంలో ఆడ్డం వచ్చిన వారిపై కాల్పులు జరపడంతో చికిత్సపొందుతూ సెక్యూరిటీ గార్డు మరణించాడు. మరోక సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. రెండు చోట్ల కాల్పులు జరిపింది ఒకరేనని, అంతేకాకుండా ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఆరు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.

Tags:    

Similar News