అక్కడ మళ్లీ మేమే

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు భారతీయ జనతా పార్టీదేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Update: 2022-02-10 02:04 GMT

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు భారతీయ జనతా పార్టీదేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ దాదాపు 70 నిమిషాలు పాటు పాల్గొన్నారు. వివిధ అంశాలపై స్పందించారు. దేశంలో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది లేదని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లలో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వారసత్వ రాజకీయాలను....
దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. బీజేపీ సమిష్టి నాయకత్వంతోనే నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ తమ నినాదమని చెప్పిన ఆయన సుస్థిరత భారత్ బీజేపీ లక్ష్యమని ఆయన వివరించారు. ప్రభుత్వానికి సానుకూల వాతావరణమే ఉందని చెప్పారు. రైతు ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం చట్టాలను తెచ్చినా, తర్వాత దేశ ప్రయోజనాల కోసం వాటిని వెనక్కు తీసుకున్నామని మోదీ చెప్పారు.
ఒక ముఖ్యమంత్రిగా....
తాను ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశానని, రాష్ట్ర అవసరాలు తనకు తెలుసునని మోదీ అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి కోసమే ఈ ఏడేళ్లు పనిచేశామని చెప్పారు. కొన్ని కఠిన నిర్ణయాలు ఉన్నాయంటే అవి దేశ ప్రయోజనాల కోసమేనని మోదీ చెప్పారు. కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని మోదీ అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఈసారి కూడా ఖచ్చితంతా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News