మోదీకి ఘాటు లేఖ రాసిన ప్రొఫెసర్లు

ప్రధాని మోదీకి ప్రొఫెసర్లు ఘాటు లేఖ రాశారు. జేఈఈ – నీట్ పరీక్షలు వాయిదా వేయవద్దని వారు ఆ లేఖలో కోరారు. కొందరి రాజకీయాల ప్రయోజనం కోసం [more]

Update: 2020-08-27 05:09 GMT

ప్రధాని మోదీకి ప్రొఫెసర్లు ఘాటు లేఖ రాశారు. జేఈఈ – నీట్ పరీక్షలు వాయిదా వేయవద్దని వారు ఆ లేఖలో కోరారు. కొందరి రాజకీయాల ప్రయోజనం కోసం విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రొఫెసర్లు పేర్కొన్నారు. పరీక్షలను వాయిదా వేయడమంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని వారు తెలిపారు. తరగతుల ప్రారంభంపై కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భయాన్ని తొలగించాలని వారు లేఖలో కోరారు.

Tags:    

Similar News