నేటి నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత ఈరోజు నుంచి పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది. దాదాపు ఏడు నెలల [more]

Update: 2020-11-02 02:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత ఈరోజు నుంచి పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది. దాదాపు ఏడు నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తొలుత నేటి నుంచి 9,10 తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠశాలల్లోకి అనుమతిస్తారు. ఈ నెల 23వ తేదీ నుంచి 6,7.8 తరగతులు ప్రారంభమవుతాయి. డిసెంబరు 14వ తేదీ నుంచి అన్ని తరగతులకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. ఈ నెల అంతా ఒక పూట బడులను మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. టీచర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది. కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News