Bjp : త్వరలో రెండు ఉపఎన్నికలు ఖాయం

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో [more]

;

Update: 2021-11-12 06:17 GMT
Bjp :  త్వరలో రెండు ఉపఎన్నికలు ఖాయం
  • whatsapp icon

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో రానున్నాయని రఘునందనరావు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకటి మునుగోడు.. రెండోది?

దీనిపై పెద్దయెత్తున చర్చ ప్రారంభమయింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతుంది. ఆయన రాజీనామా చేస్తే తిరిగి మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. మరో నియోజకవర్గం ఏంటా? అన్న చర్చ జరుగుతుంది. రఘునందనరావు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News