రాయపాటి పై కేసు నమోదు

రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు పైన సీబీఐ కేసు నమోదు చేసింది. రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించిన తరువాత [more]

Update: 2019-12-31 11:07 GMT

రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు పైన సీబీఐ కేసు నమోదు చేసింది. రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించిన తరువాత రాయపాటి సాంబశివరావు పై ఐపీసీ సెక్షన్లు120 (b) రెడ్ విత్ 420,406,468,477(a) పి సి ఇ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13(1)డీ కింద కేసు నమోదు చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కోసం 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న రాయపాటి తిరిగి ఆ రుణాన్ని చెల్లించకపోవడంతో నవంబర్ 18 న యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఎస్కే భార్గవ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీబీఐ అధికారులు రాయపాటి ఇళ్లతో పాటుగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కార్యాలయం, ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ల ఇళ్లలోనూ సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

Tags:    

Similar News