బ్రేకింగ్ : ఎన్నికలు సిద్ధమన్న ప్రభుత్వం.. తీర్పును గౌరవిస్తాం

ప్రజారోగ్యం కోసమే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా [more]

Update: 2021-01-25 13:12 GMT

ప్రజారోగ్యం కోసమే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఎవరిపైనో పైచేయి సాధించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరిందని ఆయన తెలిపారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News