నాయకత్వాన్ని మార్చాల్సిందే.. సోనియాకు ఘాటు లేఖ

ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని మార్చాల్సిందేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్ నేతలు లేఖ రాశారు. 23 మంది సీనియర్లు ఈ లేఖను రాశారు. రేపు కాంగ్రెస్ [more]

;

Update: 2020-08-23 05:09 GMT

ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని మార్చాల్సిందేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్ నేతలు లేఖ రాశారు. 23 మంది సీనియర్లు ఈ లేఖను రాశారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి ముందు సీనియర్ నేతలు లేఖ రాయడం పార్టీలో కలకలం రేపింది. పార్టీకి పూర్తి కాలపు నాయకుడు కావాలంటూ వారు లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ లేఖలో సోనియా గాంధీని సీనియర్ నేతలు కోరారు.

Tags:    

Similar News