శిల్పాను రంగంలోకి దించిన హైకమాండ్

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలను తొలగించేందుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని వైసీప హైకమాండ్ రంగంలోకి దించింది. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ [more]

Update: 2020-02-28 12:48 GMT

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలను తొలగించేందుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని వైసీప హైకమాండ్ రంగంలోకి దించింది. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు గత కొంతకాలంగా ఉన్నాయి. నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ కమిటీ నియామకంలో ఈ వివాదం మరింత ముదిరింది. కర్నూలు జిల్లా ఇన్ ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ పైనే ఆర్ధర్ వర్గీయులు ఫైర్ అయ్యారు. ఏకపక్షంగా అనిల్ వ్యవహరిస్తున్నారంటూ రోడ్డుకెక్కారు. పార్టీ పరువు బజారున పడటంతో నష్ట నివారణ చర్యలకు దిగింది వైసీపీ హైకమాండ్, శ్రీశైలం ఎమ్మెల్యే, సీనియర్ నేత శిల్పా చక్రపాణిరెడ్డికి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను అప్పగించింది. మార్కెట్ యార్డు కమిటీని రెండు వర్గాలను ఒప్పించి నియమించాలని శిల్పాకు చెప్పింది.

Tags:    

Similar News