బాబుకు అది అలవాటే…!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ప్రతిదానికీ రాజకీయ రంగు పులవటం అలవాటేనని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. తనకు భద్రత కుదింపుపై హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించడంపై సుచరిత [more]

;

Update: 2019-07-02 10:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ప్రతిదానికీ రాజకీయ రంగు పులవటం అలవాటేనని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. తనకు భద్రత కుదింపుపై హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించడంపై సుచరిత స్పందించారు. చంద్రబాబునాయుడు నేటికీ తాను ముఖ్యమంత్రి అనే భ్రమలోఉన్నారన్నారు. ఆయన ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడికి 58 మంది సిబ్బంది భద్రత కల్పించాల్సి ఉండగా 75 మందికి కేటాయించినట్లు సుచరిత తెలిపారు. అయినా చంద్రబాబు రాద్ధాతం చేస్తూ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నారన్నారు

Tags:    

Similar News