బిగ్ బ్రేకింగ్: వైసీపీలోకి మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వ‌ర‌లో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. [more]

;

Update: 2019-02-13 05:14 GMT

తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వ‌ర‌లో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. ఇవాళ ఆయ‌న లోట‌స్ పాండ్ లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ను క‌ల‌వ‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి అనంత‌రం టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. అయితే, పార్టీ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న ఆయ‌న పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, చంద్ర‌బాబు చొరవ తీసుకొని ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో అంతా కృష్ణ‌మోహ‌న్ మెత్త‌ప‌డ్డార‌ని, టీడీపీలోనే కొన‌సాగుతార‌ని అంతా భావించారు. ఇంత‌లో ఆయ‌న చంద్ర‌బాబుకు షాక్ ఇస్తూ టీడీపీకి రాజీనామా చేశారు. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో బ‌య‌టి వ్య‌క్తుల ప్ర‌మేయం పెరిగింద‌ని, దీనిని నిర‌సిస్తూ రాజీనామా చేస్తున్న‌ట్లు ఆమంచి ప్ర‌క‌టించారు. న‌ష్ట‌నివార‌ణ కోసం చీరాల‌లో కార్య‌క‌ర్త‌ల స‌మావేవం ఏర్పాటుచేయాల్సిందిగా క‌ర‌ణం బ‌ల‌రాంను చంద్ర‌బాబు ఆదేశించారు.

Tags:    

Similar News