ఆ యాడ్స్‌ ప్రసారం చేయొద్దు: కేంద్రం సూచన

లోన్‌ యాప్‌లపై కేంద్రం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు కీలక సూచనలు జారీ చేసింది. మోసపూరిత లోన్‌ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను డిజిటల్‌ మీడియా తమ ప్లాట్‌ఫామ్స్‌లపై ప్రసారం చేయవద్దని సూచించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ విషయాన్ని బుధవారం మీడియాకు వెల్లడిరచారు.

Update: 2023-12-27 08:57 GMT

digital ads

(Loan Apps) లోన్‌ యాప్‌లపై కేంద్రం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు కీలక సూచనలు జారీ చేసింది. మోసపూరిత లోన్‌ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను డిజిటల్‌ మీడియా తమ ప్లాట్‌ఫామ్స్‌లపై ప్రసారం చేయవద్దని సూచించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ విషయాన్ని బుధవారం మీడియాకు వెల్లడిరచారు.

‘ఈ లోన్లు యాప్‌లకు చెందిన ప్రకటనలను చాలా సోషల్‌ మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేం గమనించాం. ఇంటర్నెట్‌ వాడుతున్నవారిని ఈ ప్రకటనలు తప్పుదారి పట్టిస్తున్నాయి. మంగళవారం మేం అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు ఓ సూచన జారీ చేశాం. ఈ యూట్యూబ్‌, ట్విటర్‌, వాట్సప్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియాలలో వీటిని ప్రసారం చేయవద్దని సూచించాం’ ఓ కార్యక్రమంలో పాల్గొంటూ మీడియాకు వెల్లడించారు 

ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం, తీర్చకపోతే వేధింపులకు గురి చేయడం వంటివి లోన్‌ యాప్‌ల వల్ల జరుగుతున్నాయి. ఈ యాప్‌ల నిర్వాహకుల వల్ల దేశవ్యాప్తంగా చాలామంది బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ ప్రకటనల(online ads) వల్లే చాలామంది అమాయకులు ఈ తరహా లోన్లకు ఆకర్షితులవుతున్నారు.

Tags:    

Similar News