వంగవీటి రాధాకు వ్యతిరేకంగా సోదరుడి ధర్నా
వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర ఆందోళనకు దిగారు. విజయవాడ రాఘవయ్య పార్కు వద్దగల రంగా విగ్రహం వద్ద నరేంద్ర [more]
;
వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర ఆందోళనకు దిగారు. విజయవాడ రాఘవయ్య పార్కు వద్దగల రంగా విగ్రహం వద్ద నరేంద్ర [more]
వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర ఆందోళనకు దిగారు. విజయవాడ రాఘవయ్య పార్కు వద్దగల రంగా విగ్రహం వద్ద నరేంద్ర ధర్నా చేశారు. వంగవీటి రంగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే హత్య చేయించిందని, అటువంటి పార్టీలో రాధా చేరడం ద్వారా రంగా అభిమానులను కలిచివేసిందన్నారు. రాధా స్వంత రాజకీయ లాభాల కోసం టీడీపీలో చేరడం సరికాదన్నారు. గతంలో రాధా తల్లి చేసిన తప్పే ఇప్పుడు రాధా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రంగా హత్యకు టీడీపీ కారణం కాదని రాధా చేసిన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోవాలని నరేంద్ర డిమాండ్ చేశారు.