రజనీని మోసం చేయబోయి?

చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీని మోసం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. నియోజకవర్గానికి రెండు కోట్ల కరోనా నిధులు మంజూరయ్యాయని, ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని జగజ్జీవన్ [more]

;

Update: 2020-09-10 02:44 GMT
విడదల రజనీ
  • whatsapp icon

చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీని మోసం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. నియోజకవర్గానికి రెండు కోట్ల కరోనా నిధులు మంజూరయ్యాయని, ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని జగజ్జీవన్ రామ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేసి కనుక్కోమన్నారని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన రజనీ వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జగజ్జీవన్ నాయుడు విశాఖలో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీకి కూడా జగజ్జీవన్ రామ్ మోసం చేయబోయినట్లు తెలిసింది. రజనీ ముందుగానే అప్రమత్తం కావడంతో మోసం నుంచి బయటపడ్డారు.

Tags:    

Similar News