ఢిల్లీలో ‘ఇండియా గేట్’ను ఎందుకు నిర్మించారు? చరిత్ర ఏమిటి?

ఇండియా గేట్ ఈ పేరు ఎన్నో సార్లు వినే ఉంటారు. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఈ ఇండియాగేటుకు ఎంతో చరిత్ర ఉంది.

Update: 2023-08-14 08:08 GMT

ఇండియా గేట్ ఈ పేరు ఎన్నో సార్లు వినే ఉంటారు. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఈ ఇండియాగేటుకు ఎంతో చరిత్ర ఉంది. మన భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనమనే చెప్పాలి. ఈ ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ కు కూత‌వేటు దూరంలో ఉంటుంది. ఢిల్లీలో చూడదగిన పర్యాటక ప్రదేశాలలో ఇండియా గేటు ఒకటి. దీనిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. దీని ఎత్తు 42 మీటర్లు. దీని నిర్మాణానికి ఎర్రరాయి భరత్‌పూర్ నుంచి తెప్పించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. 1971వ సంవత్సరం నుంచి ఇక్కడ అమర్‌ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాల ప్రాంతాలు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడిప్రాంతాల్లో పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆటలు ఆడుకునేందుకకు అద్భుతమైన పార్కును కూడా నిర్మించారు. ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ ను చూడవచ్చు.

ఇండియా గేట్ చరిత్ర ఏమిటి?

ఈ ఇండియా గేటుకు ఎంతో చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ క్రీ.శ 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో 80 వేల భారత, బ్రిటీష్ జవానులు అమరులయ్యారట. ఆ తరువాత జరిగిన అఫ్ఘన్ యుద్ధంలో కూడా 10 వేల వరకు జవానులు ప్రాణాలర్పించారు. దీంతో ఇక్కడ వారి జ్ఞాపకార్థం కట్టడం ఉండాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించినట్లు చెబతారు. ఈ నిర్మాణంలో యుద్ధం సమయంలో మరణించిన జవాన్ల పేర్లు కూడా ఇక్కడ లిఖించబడ్డాయి. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశాడు. క్రీ.శ. 1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌చే పునాదిరాయి వేసిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగి 1931లో ఇది పూర్తయింది. దీని ప్రారంభ నామం ‘ఆలిండియా మెమోరియల్ వార్’. ఈ కట్టడపు ఇరువైపులాపై భాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడింది.

అమర్ జవాన్ జ్యోతి:

క్రీ.శ. 1971లో జరిగిన భారత్ -పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం కింది భాగంలో అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవానులకు కూడా ఇది నివాళులు అర్పిస్తోంది. దీనిని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు.

ఇండియా గేట్ ఎలా వెళ్లాలి?

ఢిల్లీలోని బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్‌లో దిగి, అక్కడి నుండి మూడు కోలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా గేట్ వద్దకు టాక్సీ లేదా ఆటోలో ఎక్కితే, 15 నిమిషాలలో గేట్ వద్దకు చేరుకోవచ్చు.

Tags:    

Similar News