Gold Price Today : మహిళలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అయితే కారణమేదైనా బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలా? వద్దా? అన్న దానిపై ఆలోచనలో పడ్డారు. కానీ కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం ఒకింత ఆనందం కలిగించే విషయమే. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని, అవసరమున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ధరలు పతనమవ్వడానికి...
అయితే బంగారం ధరలు పతనమవ్వడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావడం, ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతోనే బంగారం ధరలు దిగివస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో విదేశాల్లో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీంతో పాటు డిమాండ్ కు తగ్గ కొనుగోళ్లు జరగకపోవడం కూడా ధరలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. కానీ రానున్న కాలంలో ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో ప్రస్తుతం దిగివచ్చిన ధరలతో కొంత వరకూ కొనుగోళ్లు పెరిగే అవకాశముందని తెలిసింది.
ధరలు తగ్గడంతో...
అయితే బంగారం ధరలను చూసి పెట్టుబడి పెట్టేవారు ఇప్పుడిప్పుడే కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. జ్యుయలరీ దుకాణాల వద్ద కూడా కొంత రద్దీ పెరిగిందని చెబుతున్నారు. అలాగే వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గడంతో సెంటిమెంట్ వస్తువులైన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,890 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,340 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 89,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.