Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. శుక్రవారం కావడంతో?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య ఎప్పటిలాగానే పెరిగిం;

Update: 2024-11-29 02:48 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య ఎప్పటిలాగానే పెరిగింది. తుపాను హెచ్చరికలను కూడా పెద్దగా లెక్క చేయకుండా భారీ వర్షాలను కాదనుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నిన్నటి వరకూ కొద్దిగా తగ్గిన భక్తుల సంఖ్య ఈరోజు మాత్రం విపరీతంగా పెరగడంతో అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోనుంది. కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వర్షాలను కూడా లెక్క చేయకుండా భక్తులు ఎక్కువ మంది ఆపదమొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా ప్రకారం రేపు, ఎల్లుండి కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. వసతి గృహాల వద్ద కూడా భక్తులు చాలా సేపు వెయిటింగ్ చేస్తున్నారు. అలాగే అన్నదాన సత్రం వద్ద కూడా అన్నప్రసాదాల కోసం భక్తులు క్యూ కట్టారు. భారీ వర్షాలు పడతాయని చెప్పినా భక్తులు ఏ మాత్రం వెరవకుండా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

25 కంపార్ట్ మెంట్లలో...
డిసెంబరు నెలలో సెలవులు ఎక్కువగా ఉండటంతో పాటు తమ సెలవులు వినియోగించుకోవడం కూడా ఆఖరు కావడంతో వచ్చే నెల నుంచి రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. లడ్డూ తయారీతో పాటు అన్న ప్రసాదం తయారీ కూడా ఎక్కువ మొత్తంలో చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదమూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 56,952 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,714 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.


Tags:    

Similar News