చంద్రబాబుకు ఛర్మం లావైంది… ధర్నాలతో లాభం లేదు
చంద్రబాబు నాయుడు ఛర్మం లావైపోయిందని… ధర్నాలు చేస్తే ఆయనకు చలనం రాదని.. మరో మూడు నెలలు ఓపిక పడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ [more]
చంద్రబాబు నాయుడు ఛర్మం లావైపోయిందని… ధర్నాలు చేస్తే ఆయనకు చలనం రాదని.. మరో మూడు నెలలు ఓపిక పడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ [more]
చంద్రబాబు నాయుడు ఛర్మం లావైపోయిందని… ధర్నాలు చేస్తే ఆయనకు చలనం రాదని.. మరో మూడు నెలలు ఓపిక పడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయనను కడప జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి తమకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అయితే, చంద్రబాబు నాయుడు పదవీకాలం దగ్గర పడినందున ధర్నాలు చేస్తూ చదువులు పాడు చేసుకోవద్దని, ఎన్ని ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోడని, మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో గ్రామ సచివాలయాల వ్యవస్థ తీసుకువచ్చి హార్టికల్చర్ చదివిన విద్యార్థులకు వాటిల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు చదువులు పాడు చేసుకోకుండా ఓపిక పట్టాలని విద్యార్థులకు సూచించారు.