ఇది అందరి ప్రభుత్వం

అందరికీ వైద్యం, విద్య అందిననాడే నిజమైన స్వాతంత్యం లభించినట్లని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించిన [more]

Update: 2021-08-15 04:58 GMT

అందరికీ వైద్యం, విద్య అందిననాడే నిజమైన స్వాతంత్యం లభించినట్లని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మనిషిని మనిషిగా చూసే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారని జగన్ అన్నారు. కుల, మత, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా లబ్ది చేకూరాలని జగన్ అన్నారు. గడిచిన 26 నెలలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చామని తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానిక 83 వేల కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. పారదర్శక పాలనను అందిస్తున్నామని జగన్ తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు.

Tags:    

Similar News