జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు అప్పుడేనట?
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు ఈరోజు సీబీఐ కోర్టులో వెల్లడి కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు ఎప్పుడు [more]
;
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు ఈరోజు సీబీఐ కోర్టులో వెల్లడి కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు ఎప్పుడు [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు ఈరోజు సీబీఐ కోర్టులో వెల్లడి కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని అనేక మంది ఆరా తీస్తున్నారు. పత్రికా కార్యాలయాలకు, మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ పై నేడు తీర్పు రానుంది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై కూడా సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. విజయసాయిరెడ్డి కేసులో విచారణ పూర్తయిన తర్వాతనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నారు.