బిగ్ బ్రేకింగ్ : జగన్ బెయిల్ రద్దు తీర్పు వచ్చే నెల 15కు వాయిదా
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ముగిసింది. రెండు కేసుల్లో తీర్పు వచ్చే నెల 15వ తేదీన వెలువరిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ 213 సెప్టెంబరు 23న బెయిల్ పై విడుదలయ్యారు. 2010లో హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. 2011లో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసుల్లో మొత్తం 71 మందిని నిందితులుగా చేర్చారు. 2012 మే 25వ తేదీన ఈ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. 16 నెలల జైలు జీవితం గడిపిన అనంతరం తర్వాత విడుదలయ్యారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి జగన్ బెయిల్ పై ఉన్నారు. అయితే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటీషన్ వేశారు. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న అధికారులు ఏపీలో కీలక భూమిక పోషిస్తున్నారని రఘురామ కృష్ణరాజు తరుపున న్యాయవాదులు తెలిపారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సెప్టంబరు నెల 15వ తేదీకి వాయిదా వేసింది.