Ys jagan : మోదీకి జగన్ మరో లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ వినియోగంపై ఆయన లేఖ రాశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ వినియోగంపై ఆయన లేఖ రాశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ వినియోగంపై ఆయన లేఖ రాశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉందని, కోవిడ్ తర్వాత 20 శాతం పెరిగిందని జగన్ వివరించారు. బొగ్గు కొరత కారణంగా ఏపీలోని యాభై శాతం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, 75 శాతం కేంద్ర విద్యుత్ ప్లాంట్ లలో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని జగన్ తెలిపారు. కేవలం రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఏపీ విద్యుత్ కేంద్రాల వద్ద ఉన్నాయని, సరిపడా బొగ్గు నిల్వలు కేటాయించాలని ప్రధానిని జగన్ కోరారు.