Ys jagan : రెండురోజులు తిరుమలలోనే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఈనెల 11, 12 తేదీల్లో ఆయన తిరుమలలో ఉంటారు. 11న మధ్యాహ్నం తిరుపతి చేరుకోనున్న [more]

;

Update: 2021-10-09 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఈనెల 11, 12 తేదీల్లో ఆయన తిరుమలలో ఉంటారు. 11న మధ్యాహ్నం తిరుపతి చేరుకోనున్న జగన్ బర్డ్ ఆసుపత్రిని తిరుపతిలో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొత్తగా ఏర్పాటయి అలిపిరి మెట్ల మార్గం వద్ద గో మందిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 11వ తేదీ రాత్రికి జగన్ తిరుమలలోనే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం శ్రీవారిని జగన్ దర్శించుకుంటారు. అనంతరం 12 కోట్ల వ్యయంతో నిర్మించిన బూందీపోటును ప్రారంభిస్తారు. తర్వాత టీటీడీ రైతు సాధికారక సంస్థ ఎంఓయూ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.

Tags:    

Similar News