Ys jagan : విద్యుత్తు కోతలు లేకుండా చూడాల్సిందే

రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. విద్యుత్తు కోతలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు కొరత లేకుండా ముందుగానే కొనుగోలు [more]

;

Update: 2021-10-14 12:41 GMT

రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. విద్యుత్తు కోతలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు కొరత లేకుండా ముందుగానే కొనుగోలు చేయాలని సూచించారు. ధర్మల్ విద్యుత్తు కేంద్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కోరారు. ప్రస్తుతం బొగ్గు కొరత లేదని, సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకుని బొగ్గు నిల్వలను రప్పించాలని అధికారులను జగన్ ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

Tags:    

Similar News