విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ చెక్..!

హైద‌రాబాద్ లోనే కూర్చుంటార‌ని, లోట‌స్ పాండ్ రాజ‌కీయాలు చేస్తార‌ని ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెక్ పెడుతున్నారు. 23న [more]

;

Update: 2019-05-14 07:12 GMT

హైద‌రాబాద్ లోనే కూర్చుంటార‌ని, లోట‌స్ పాండ్ రాజ‌కీయాలు చేస్తార‌ని ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెక్ పెడుతున్నారు. 23న క‌చ్చితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌యం త‌మ‌దే అని ధీమాగా ఉన్న వైసీపీ పార్టీ కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించేస్తుంది. తాడేప‌ల్లిలో ఇప్ప‌టికే సిద్ధ‌మైన పార్టీ కార్యాల‌యానికి హైద‌రాబాద్ నుంచి సామాగ్రిని త‌ర‌లిస్తున్నారు. జ‌గ‌న్ సైతం ఇవాళ మూడు రోజుల పులివెందుల ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. త‌ర్వాత ఆయ‌న కూడా అమ‌రావ‌తిలోనే త‌న కొత్త నివాసంలోనే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 23వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజు సైతం జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి అమ‌రావ‌తిలోని పార్టీ కార్యాల‌యంలోనే ఉండ‌నున్నారు.

Tags:    

Similar News