జాగ్త్రత్త అంటున్న పవన్!

Update: 2016-08-27 11:52 GMT

తిరుపతి బహిరంగ సభలో బిజెపి ప్రభుత్వం పై పవన్ ఘాటైన విమర్శలు చేశారు. ఆయన బిజెపి ప్రభుత్వం పై తీవ్రం గా విరుచుకు పడ్డారు. బిజెపి ప్రభత్వం కూడా కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తుందని..... ప్రత్యేక హోదా కోసం మేము అడుక్కోమని అది మా హక్కని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా కోసం మూడు దశలుగా జనసేన పోరాడుతుందని బిజెపిని హెచ్చరించారు. మొదటి దశలో కాకినాడలో మీటింగ్ పెడతానని.... ప్రతి జిల్లాలో తిరిగి గ్రామాల్లో సభలు నిర్వహిస్తానని చెప్పారు. ఇక రెండో దశలో రాష్ట్ర మంత్రులను, ఎంపీలపై ఒత్తిడి తీసుకొస్తామని... మూడో దశలో ప్రజాభిప్రాయ సేకరణలో రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని బిజెపిని తీవ్రంగా హెచ్చరించారు. అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన వెంకయ్య ఇప్పుడు అవసరం లేదని చెబుతున్నారని పవన్ అన్నారు. మోడీ ని ఉద్దేశించి ఏపీకి ప్రత్యేక హోదా గనక రాకపోతే యువతకి భవిష్యత్తులేదని అన్నారు. ఇంకా టిడిపి ప్రభుత్వం ప్రత్యేక హోదా ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతుందని..... వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబుకు చురకలంటించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడామని ఏపీ ఎంపీలకు హితవు పలికారు. జాతీయ పార్టీలకు గులాం గిరి చెయ్యొద్దని మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని ప్రాధేయ పడ్డారు. 6 కోట్లమంది వద్దంటే రాష్ట్రాన్ని విడగొట్టారని.... 3 రు ముఖ్యమంత్రులు హోదాకి అడ్డుపడుతున్నారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అలాగే వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాల పక్కన నిలబడాలని.... ఇంకా ఆయన పార్టీ కోసం మాట్లాడడం మానేసి ఏపీ ప్రజలకోసం మాట్లాడాలని వెంకయ్యకి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Similar News