పోలింగ్ బూత్ లో సెల్ఫీలు దిగొచ్చా.?

Update: 2017-02-04 10:38 GMT

పోలింగ్ బూత్ లలో సెల్ఫీలు దిగొచ్చా. ఈ విషయం పంజాబ్ ఎన్నికల అధికారులను అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే శనివారం పంజాబ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. క్రికెటర్ హర్బజన్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జలంధర్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే హర్బజన్ తో సెల్ఫీలు దిగేందుకు పోలింగ్ కేంద్రలోని ఎన్నికల సిబ్బంది పోటీ పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు దిగుతూ హర్బజన్ ను కూడా ఇబ్బంది పెట్టేశారు. అయితే ఈ సెల్ఫీలు సోషల్ మీడియాలోకి వచ్చి పడటంతో పెద్ద దుమారం చెలరేగింది.

పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది తమ విధులను పక్కన పెట్టి సెల్ఫీల దిగడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సెల్పీలు దిగాలనుకుంటే విధులను పక్కన పెట్టేసి దిగాలని కొందరు ఆగ్రహించారు కూడా. జలంధర్ లోని 23వ నెంబరు పోలింగ్ బూత్ లో జరగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. సెల్ఫీలు దిగిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తం మీద హర్బజన్ తో ఎన్నికల సిబ్బంది తీసుకున్న సెల్పీలు సంచలనమే సృష్టించాయి.

Similar News