మోడీ ఎత్తుకు నల్లకుబేరుల పైఎత్తు

Update: 2017-01-30 05:14 GMT

పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నల్లకుబేరుల భరతం పట్టారనుకుంటే పొరపాటే. ఎందుకంటే బ్లాక్ మనీని అత్యంత తేలిగ్గా మార్చేసుకున్నారు. పేదల ఖాతాల్లో నల్లడబ్బును జమ చేసి మళ్లీ విత్ డ్రా చేసేసుకున్నారు. జన్ ధన్ ఖాతాల్లోనుంచి నెలలోనే 5,582 కోట్ల నగదును తీసేసుకున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల కొత్త ఎత్తు ఫలించందనే అంటున్నారు.

నవంబరు 8న పెద్ద నోట్లను మోడీ రద్దు చేశారు. అయితే నోట్ల రద్దు తర్వాత నెలరోజుల్లో జన్ ధన్ ఖాతాల్లో దేశవ్యాప్తంగా 74,610 కోట్ల రూపాయల నగదు జమ అయింది. దీనిపై ఆర్బీఐ వర్గాలతో పాటు ప్రధాని సైతం ఆందోళన వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాల్లో సొమ్ము మీదే అంటూ ప్రకటన కూడా చేశారు. అయినా జన్ ధన్ ఖాతాల్లో ఐదు వేల ఐదొందల ఎనభై రెండు కోట్ల నగదు విత్ డ్రా అయిందని ఆర్బీఐ గుర్తించింది. నగదు విత్ డ్రా పరిమితిని వారానికి పదివేలకు పరిమితం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగిలిన సొమ్మును కూడా రానున్న కాలంలో విత్ డ్రా అవుతుందని భావిస్తున్నారు. జన్ ధన్ ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినా ఫలితం లేకుండా పోయింది. నల్లకుబేరులు పేదల ఖాతాల్లో బ్లాక్ మనీని జమ చేసి వారికి కొంత కమీషన్ ముట్ట జెప్పి నగదును వైట్ గా మార్చుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద మోడీ ఎత్తుకు నల్లకుబేరులు పైఎత్తు వేశారన్న మాట.

Similar News