రెండు నెలల్లోనే నివేదిక ఇచ్చాం : చంద్రబాబు

Update: 2017-01-24 14:32 GMT

డిజిటల్ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ ప్రధాని మోడీకి మధ్యంతర నివేదికను సమర్పించింది. మొత్తం 11పేజీల ఉన్న మధ్యంతర నివేదకను మోడీకి ముఖ్యమంత్రుల కమిటీ అందజేసింది. నగదు రహిత లావాదేవీలు దేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. డిజిటల్ చెల్లింపు ప్రగతి పర్యవేక్షణకు స్థాయీ సంఘాన్ని నియమించాలని సూచించింది. వ్యాపారులకు పన్ను రాయితీలు కల్పించాలని, మార్చి 31 వతేదీ నాటికి దేశంలో బ్యాంక్ అకౌంట్లతో ఆధార్ కార్డుల అనుసంధానం పూర్తి చేయాలని పేర్కొంది. ఇకపై ఆధార ఆధారిత చెల్లింపులే చేయాలని తెలిపింది. అన్ని బ్యాంకుల లావాదేవీల పర్యవేక్షణకు డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలంది. ప్రతి ఒక్కరికీ నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా ఇవ్వాలని కోరింది. డిజిటల్ చెల్లింపులపై మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. సిక్కిం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో నే కమిటీ రిపోర్ట్ ను ప్రధానికి అందజేసింది.

Similar News