Visakhapatnam : విశాఖలో ప్రధాని రోడ్ షో ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. రోడ్ షో ప్రారంభించారు;

Update: 2025-01-08 11:48 GMT

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. అనంతరం విశాఖపట్నంలో రోడ్ షోను ప్రారంభించారు. రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో దాదాపు గంటకుపైగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్ షో గంటకు పైగా సమయం పడుతుంది.

మూడు గంటలపాటు...
విశాఖలో మొత్తం మూడు గంటల పాటు ఉండనున్నారు. ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి విశాఖపట్నంకు వచ్చిన ప్రధాని మోదీ దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయనున్నారు.సిరిపురం నుంచి ఏయూ జంక్షన్ వరకూ రోడ్ షో జరగనుంది. ప్రధాని బహిరంగ సభలో ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. తొలిసారి విశాఖకు వచ్చిన ఆయన ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News