ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. రోడ్ షో తో పాటు ఇరవై పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో రోడ్ షో జరుగుతుంది. ఇప్పటికే అధికారులు అంందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఎన్ఎస్జీ కమాండోల చేతిలోకి విశాఖ వెళ్లిపోయింది. ఈరోజు సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విమానంలో విశాఖపట్నం చేరుకుని సాయంత్రం 4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారు.
మూడు గంటల పాటు విశాఖలోనే...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖలో దాదాపు పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెంకటాద్రి వంటిళ్ళు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారు. అక్కడ నుంచే వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్,నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్,గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు.అలాగే 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించనున్నారు.
బహిరంగ సభలో...
అయితే బహిరంగ సభలో ప్రధాని ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు ప్రకటించే అవకాశముందని కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తామని ఈ సభ నుంచి మోదీ హామీ ఇచ్చే అవకాశముంది. అలాగే నీటిపారుదల ప్రాజెక్టు అంశాలతో పాటు ఇండ్రస్ట్రియల్ కారిడార్ తో పాటు అనేక విషయాలు ఆయన ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చేఅవకాశముందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత విశాఖకు వస్తుండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి కూడా ఏదైనామాట్లాడతారా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే దానిపై కూడా తమకు క్లారిటీ ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ లో దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలకం కావడంతో ఈసారి ప్రధాని మోదీ ఏపీ ప్రజలపై వరాల జల్లు ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ