Gold Price Today : ఈరోజు బంగారం ధరలను చూస్తే షాకవుతారు అంతే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి;

బంగారం ధరలు నిత్యం వినియోగదారులకు షాకిస్తూనే ఉంటాయి. ధరలు పెరుగుదల బంగారం తన అలవాటుగా మార్చుకుంది. దీంతో పాటు వెండి ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర 91 వేల రూపాయలు దాటింది. కిలో వెండి ధర అయితే లక్ష పన్నెండు వేల రూపాయలకు చేరుకుంది. ఇంత ధరలు పెరగడంతో వినియోగదారులు కొనేందుకు కూడా వెనకాడటం సహజమే. ఇంత ధరను పెట్టి కొనుగోలు చేయలేని ఎక్కువ మంది తమ అవసరాల నిమిత్తం కావాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని, అందువల్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని జ్యుయలరీ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.
వన్ గ్రామ్ గోల్డ్ కు...
మెడలో బంగారు ఆభరణాలు ఉంటే అదొకరకమైన ఆనందం .. ఫీలింగ్స్ ఉండేవి. చూసే వారి నుంచి కూడా అరుదైన గౌరవం దక్కేది. అయితే ఇప్పుడు గోల్డ్ స్థానంలో గిల్టు నగలను ధరిస్తున్నారు. ఏది బంగారమో, ఏది నకిలీయో తెలియని పరిస్థితుల్లో ధరల పెరుగుదలతో కొనుగోలు చేయలేక వన్ గ్రామ్ బంగారు ఆభరణాలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక బంగారం కొనుగోలు చేసేది కేవలం పెట్టుబడి పెట్టేవారు మాత్రమే. భవిష్యత్ లో తమకు లాభాలను తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో డబ్బున్న వారు మాత్రమే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో అమ్మకాలు పెరిగే అవకాశముందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఇలా...
బంగారం అనేది ఇప్పుడు కొందరి సొంత వస్తువుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న, పేద, మధ్యతరగతి కుటుంబాలు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. గత నాలుగు రోజుల్లో బంగారం ధర దాదాపు 1900 రూపాయలు పెరిగింది. వెండి ధర 1100 రూపాయల మేర తగ్గింది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 83,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,12,900 రూపాయలకు చేరుకుంది.