సుధాకర్ కుటుంబానికి సర్కార్ భరోసా

వైసీపీ ప్రభుత్వ హయాంలో మృతి చెందిన వైద్యుడు సుధాకర్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.;

Update: 2025-03-29 02:45 GMT
vangalapudi anitha, home minister, doctor sudhakar family, visakha
  • whatsapp icon

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మృతి చెందిన వైద్యుడు సుధాకర్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. విశాఖ నగరం సీతమ్మధారలోని వైద్యుడి ఇంటికి ఆమె స్వయంగా వెళ్లి పరామర్శించారు. కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై భావోద్వేగానికి గురైన తల్లి కావేరిబాయిని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

అనిత పరామర్శ...
కుటుంబ సభ్యులు లేవనెత్తిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న అనిత కరోనా డ్‌ సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు జగన్‌ ప్రభుత్వం సుధాకర్‌ను విధులు నుంచి తొలగించిందని విమర్శించారు. దీనిపై తాను టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో రాసిన లేఖను హైకోర్టు సుమోటాగా స్వీకరించి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చిందని అనిత గుర్తు చేశారు.


Tags:    

Similar News