World Cup : పాక్ ను వెనక్కు నెట్టేసిన ఆప్ఘాన్
పాకిస్థాన్ కంటే ఆప్ఘనిస్థాన్ మెరుగైన పాయింట్లతో పైకి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
పాకిస్థాన్ కంటే ఆప్ఘనిస్థాన్ మెరుగైన పాయింట్లతో పైకి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ఆప్ఘనిస్థాన్ ఇప్పుడు ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించిన ఆప్ఘనిస్థాన్ ఐదో స్థానానికి చేరుకోవడంతో పాకిస్థాన్ ఆరోస్థానానికి పడిపోయింది. శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీస్ నుంచి వెళ్లిపోయినట్లే. తాజాగా నెదర్లాండ్స్ పై ఆప్ఘనిస్థాన్ గెలిచి టేబుల్ లో పాకిస్థాన్ కంటే ముందు నిలిచింది. పాకిస్థాన్ ఏడు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి నాలుగింటిలో ఓటమి పాలు కావడంతో ఆరు పాయింట్లతో నిలిచింది. ఆప్ఘనిస్థాన్ ఏడు మ్యాచ్ లలో ఆడి నాలుగింటిలో గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఇంకా పాక్, ఆప్ఘనిస్థాన్ లకు చెరి రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
నెదర్లాండ్ పై గెలిచి...
ఈరోజు నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 180 పరుగులకే అవుటయింది. తర్వాత ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆప్ఘనిస్థాన్ ఆరంభంలో తడబడినా తర్వాత నిలదొక్కుకుంది. 32 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆప్ఘనిస్థాన్ విజయంతో మరోసారి గర్వంగా తలెత్తుకుంది. నెదర్లాండ్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆప్ఘనిస్థాన్ ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా, పాకిస్థాన్ లు ఓడించి అతి పెద్ద టీంగా అవతరించింది. ఇప్పుడు సెమీ ఫైనల్స్ లో దూసుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. కానీ భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను దాటుకుని వెళ్లాలంటే కొంత కష్టమే అయినప్పటికీ చివరి వరకూ ప్రయత్నం చేస్తున్న ఆప్ఘాన్ ఆటగాళ్లను అభినందించక తప్పదు.