World Cup 2023 : టాస్ గెలిచిన టీం ఇండియా.. తొలుత బ్యాటింగ్

వన్డే కప్ లో అద్భుతమైన మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.;

Update: 2023-11-05 08:06 GMT
india , won the toss, south africa, world cup, kolkatta, cricket match
  • whatsapp icon

వన్డే కప్ లో అద్భుతమైన మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా - సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు అంతా సిద్ధమయింది. స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. హోరెత్తుతున్న నినాదాల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈరోజు విరాట్ కోహ్లి పుట్టిన రోజు కూడా కావడంతో స్టేడియంలో అభిమానుల సందడి గురించి ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన పనిలేదు.

నిండిపోయిన స్టేడియం...
ఇండియా ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లలో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. సౌతాఫ్రికా ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది. రెండు సమ ఉజ్జీలే. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్చాచ్ ను వీక్షించేందుకు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఎవరిది పై చేయి అన్నది నేడు తేలిపోనుంది. సౌతాఫ్రికాను ఓడించి భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పుతుందని కోరుకుందాం.


Tags:    

Similar News