World Cup 2023 : బ్యాడ్‌లక్ ఆస్ట్రేలియా టైం బాగోలేదే... మరొక ఆటగాడు కూడా?
వరల్డ్ కప్ కు మరో ఆస్ట్రేలియా ఆటగాడు దూరమవుతున్నాడు. ఇప్పటికే గ్లెస్ మ్యాక్స్ వెల్ గాయం కారణంగా దూరమయ్యాడు.
వరల్డ్ కప్ కు మరో ఆస్ట్రేలియా ఆటగాడు దూరమవుతున్నాడు. ఇప్పటికే గ్లెస్ మ్యాక్స్ వెల్ గాయం కారణంగా తర్వాత మ్యాచ్ కు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ కూడా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడటానికి అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. దీంతో ఆసీస్ రానున్న మ్యాచ్‌లలో ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ కు సెమీస్ కు అవకాశాలు కలసి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఆస్ట్రేలియాకు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కావడం పాక్ కు లక్ కలసి వచ్చేటట్లు ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
మార్ష్ కూడా...
వరల్డ్ కప్ మ్యాచ్ లకు మిచెల్ మార్ష్ దాదాపుగా ఇక దూరమయినట్లేనని చెబుతున్నారు. అతను భారత్ కు తిరిగి రావడం అనుమానమేనని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే మిచెల్ మార్ష్ అర్జంటుగా స్వదేశానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఆస్ట్రేలియా టీం మరికొంత బలహీన పడే అవకాశాలున్నాయి. మ్యాక్స్ వెల్ గాయాలపాలు కావడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆసీస్ టీం మార్ష్ కూడా దూరం కావడంతో మరింత కష్టాల్లో పడినట్లయింది.
ఇద్దరు దూరం కావడంతో...
ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లకు దూరం కావడం ఆసీస్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తునున్నాయి. ఇద్దరూ ఈ వరల్డ్ కప్ లో చెరో సెంచరీ నమోదు చేశారు. పాక్ పై మార్ష్, నెదర్లాండ్స్ పై మ్కాక్స్‌వెల్ సెంచరీలు చేశారు. తొలుత వరల్డ్ కప్ లో కొన్ని ఓటములు ఎదురయినా తర్వాత మాత్రం ఫామ్ లోకి వచ్చి వరస విజయాలతో ముందుకు వెళుతుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు విజయాలను సాధించి ఎనిమిది పాయింట్లను సంపాదించింది. ఐదో స్థానంలో ఆరు పాయింట్లతో పాకిస్థాన్ ఉంది.
పాక్ కు లాభించేనా?
న్యూజిలాండ్ పై విజయం సాధించడంతో మరింత ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు ముందుకెళుతున్న సమయంలో ఇద్దరు కీలక ఆటగాళ్లు మ్యాచ్ లకు దూరం కావడంతో కొంత ఇబ్బంది తప్పదని అంటున్నారు క్రీడా పండితులు. ఆస్ట్రేలియా బలహీనపడితే తర్వాత స్థానంలో ఉన్న పాక్ జట్టుకు సెమీస్ కు వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. మిచెల్ మార్ష్ మ్యాచ్ కు దూరం కావడంతో ఆస్ట్రేలియా ఓపెనర్ల సమస్యను ఎదుర్కొంటుందని, తమకు అవకాశాలుంటాయని పాక్ విశ్వసిస్తుంది.