వాయుకాలుష్యం.. ఆట‌గాళ్ల‌కు ద‌గ్గు.. ఏం చేశారంటే..

ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2023-11-04 01:58 GMT

ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ టీం ఆట‌గాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని పేర్కొంటూ.. శిక్ష‌ణా శిబిరాన్ని ర‌ద్దు చేసుకున్నాయి. నవంబర్ 6న శ్రీలంకతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టు బుధవారం ఢిల్లీకి చేరుకుంది. టీం మేనేజ్‌మెంట్‌ మొదట్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 ప్రాక్టీస్ సెషన్‌లను షెడ్యూల్ చేసింది. అందులో మొదటిది శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య షెడ్యూల్ చేశారు.

ఢిల్లీలో గురువారం ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. నగరంలో చాలా చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు పాఠశాలలను మూసివేసి భవన నిర్మాణాలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ మాట్లాడుతూ.. "ఈరోజు మాకు శిక్షణా సెషన్ ఉంది, కానీ పరిస్థితులు దిగజారుతున్నందున మేము క్యాన్సిల్ చేసుకున్నాం."- “మాకు మరో రెండు రోజుల శిక్షణ కార్య‌క్ర‌మం షెడ్యూల్ చేయ‌బ‌డి ఉంది. ఆట‌గాళ్లలో కొందరికి దగ్గు మొదలయ్యింది.. అది ప్రమాదం.. వారు అనారోగ్యానికి గురికావడం ఇష్టం లేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News