World Cup Semi Finals 2023 : ఎవరు గెలుస్తారు? ఇండియాపై ఫైనల్స్‌లో ఆడేదెవరు?
వరల్డ్ కప్ లో మరో కీలక సమరం నేడు జరగబోతుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
వరల్డ్ కప్ లో మరో కీలక సమరం నేడు జరగబోతుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఈ నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్స్ లో తలపడనుంది. అందుకే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ మ్యాచ్ ఈరోజు పూర్తిగా జరగుతుందా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
వర్షం కురుస్తుందని...
వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే రేపు రిజర్వ్‌డే గా నిర్ణయించారు. యాభై శాతం కోల్‌కత్తాలో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రెండు జట్లు బితుకు బితుకు మంటున్నాయి. వర్షం వస్తే ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం? అన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మ్యాచ్ రద్దయితే అత్యధిక రన్ రేట్ తో ఉన్న సౌతాఫ్రికానే ఫైనల్స్ కు చేరే అవకాశాలున్నాయి. రిజర్వ్‌డే కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితేనే రన్ రేట్ ప్రకారం సౌతాఫ్రికాను ఫైనల్స్ కు ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు.
బలాబలాలు...
అందుకోసమే వర్షం కురవకూడదని ప్రధానంగా ఆస్ట్రేలియా జట్టు ప్రార్థిస్తుంది. మరోవైపు రెండు జట్లు బలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో తొలి దశలో కొన్ని ఓటములు చవి చూసినా తర్వాత లీగ్ మ్యాచ్ లో వరస విజయాలతో దూకుడు పెంచింది. అలాగే సౌతాఫ్రికాది కూడా సేమ్ టు సేమ్. రెండు జట్లు బలాబలాల్లో సరిసమానంగా ఉండటంతో గెలుపోటములపై ముందుగా అంచనా వేయడం కష్టమే అవుతుంది. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కు చేరాలని ఇరుజట్లు పోరాడతాయి. కానీ వర్షం అడ్డంకి లేకుండా ఉంటే.. మ్యాచ్ సజావుగా జరిగితే ఎవరిది విజయం అన్నది ముందుగా తేల్చలేని పరిస్థితి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఇండియాపై ఫైనల్స్ లో తలపడుతుంది.