World Cup 2023 : రన్ మిషీన్ కు రికార్డులకు అరుదైన అవకాశం.. ఈరోజు సెంచరీ చేస్తే
భారత్ - నెదర్లాండ్స్ మీద జరిగే వన్డే మ్యాచ్ లో గెలుపోటముల కన్నా విరాట్ కోహ్లిపైనే ఎక్కువ దృష్టి ఉంది
వరల్డ్ కప్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు జరగబోతుంది. నెదర్లాండ్స్ మ్యాచ్ లో గెలుపు కన్నా రికార్డులపైనే ఎక్కువ ఫ్యాస్స్ ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా విరాట్ కోహ్లి పైనే అందరి దృష్టి ఉంది. అందులో బెంగళూరులో జరిగే మ్యాచ్. రాయల్ ఛాలెంర్స్ బెంగళూరు ఆటగాడైన విరాట్ కోహ్లి బెంగళూరులోనే యాభైవ శతకం చేయాలని అందరూ ఆకాక్షింస్తున్నారు. పైగా నెదర్లాండ్స్ లో మ్యాచ్ కావడంతో విరాట్ కు ఇది పెద్దకష‌్టమేమీ కాదన్న అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమవుతుంది.
49వ సెంచరీని ...
ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా పెద్దగా టీం ఇండియాకు ఫరక్ పడదు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంటుంది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇండియా జట్టును మరే జట్టు చేరుకోలేదు కూడా అయితే అందుకోసమే విరాట్ కోహ్లికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో కోల్‌కత్తాలో జరిగిన వన్డే మ్యాచ్ లో 49వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సచిన్ రికార్డులను సమం చేశాడు. తన పుట్టిన రోజునాడే విరాట్ శతకం బాది అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నమోదయ్యాడు. ఆరోజు అందరు అభిమానులు కోరుకున్నట్లే విరాట్ తన సెంచరీని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
అదే ఆకాంక్ష...
ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. యాభైవ సెంచరీ చేసేందుకు ఇది మంచి అవకాశం. సచిన్ రికార్డులను అధిగమించి టాపర్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ విరాట్ కోహ్లి 543 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అతడి పేరు నమోదయ్యే అవకాశముంది. రన్ మెషీన్ కు ఇది అరుదైన అవకాశమని భావిస్తున్నారు. విరాట్ కోహ్లి మరో సెంచరీ బాదేసి రికార్డును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి కూడా అదే ఊపుతో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ ఈ మ్యాచ్ లోనూ సెంచరీ సాధించాలని ఆశిద్దాం.