T20 World Cup 2024 : సెమీస్ కు అవకాశాలు మెగురుపడినట్లే.. బంగ్లాదేశ్ పై విజయంతో భారత్ మరింత ముందుకు

భారత్ యాభై పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు దారి సుగమంం చేసుకుంది.

Update: 2024-06-23 04:38 GMT

సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. వరస విజయాలు టీం ఇండియాను పలుకరిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ లోనూ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించిన టీం ఇండియా చివరకు ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయింది. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడితే అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయినప్పటికీ సూపర్ 8 లోకి భారత్ సునాయాసంగా ప్రవేశించింది. అయితే ఈ వరస విజయాలతో సెమీస్ లోకి ప్రవేశించడానికి కూడా భారత్ మార్గం సుగమం చేసుకున్నట్లే అయింది. ఇలాగే ఆడితే మనోళ్లకు ఇక తిరుగుండదు. అదే భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరస విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మరింత ముందుకు సాగి ఈ సారి టీ 20 వరల్డ్ కప్ కొట్టేయాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సునాయాసంగా...
నిన్న భారత్ బంగ్లాదేశ్ పై సునాయాసంగా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు నిదానంగా ఫామ్ లోకి వస్తున్నారు. రోహిత్ శర్మ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. విరాట్ కోహ్లి 37 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. ఇద్దరు అవుటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆరు పరుగులకే అవుటయ్యాడు. దీంతో పెద్ద స్కోరు చేస్తుందా? లేదా? అన్న అనుమానం బయలుదేరింది. తర్వాత వచ్చిన శివమ్ దూబే కూడా 34 పరుగులు చేసి అవుటయ్యాాడు, ఇక ఆల్ రౌండర్ హార్ఢిక్ పాండ్యా తన బ్యాట్ కు పనిచెప్పడంతో భారీ పరుగుుల టీం ఇండియా చేయగలిగింది. ఇరవై ఓవర్లలకు ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
యాభై పరుగుల తేడాతో...
బంగ్లాదేశ్ ఈ స్కోరు చూసి వత్తిడికి గురవుతుందన్న అంచనాలు నిజమయ్యాయి. ఛేజింగ్ లో ఇండియన్ బౌలర్లను తట్టుకోవడానికి బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మన బౌలర్లు కులదీప్ యాదవ్ సరైన సమయంలో వికెట్లు తీసి బంగ్లా వెన్ను విరిచాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో నమ్లు్ శాంటో నలభై పరుగులు, తంజిద్ 29 పరుగులు అత్యధికంగాచేశారు. అర్హదీప్ సింగ్ రెండు, బుమ్రా రెండు, హార్ధిక్ పాండ్యా ఒకటి, కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ కథ ముగిసినట్లయింది. ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ యాభై పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు దారి సుగమంం చేసుకుంది.


Tags:    

Similar News