World Cup 2023 : ఈ ప్రపంచ కప్‌లో భారత్ అతి హీనమైన ప్రదర్శన ఏదంటే?
ఇంగ్లండ్ పై భారత్ తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు మాత్రమే బాగా రాణించారు
ఇంగ్లండ్ పై భారత్ తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు మాత్రమే బాగా రాణించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలలేదు. సూర్యకుమార్ 49 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ యాభై ఓవర్లకు 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ లక్ష్యం 230 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎవరూ ఆగలేకపోయారు. వరసగా వెనుదిరగడంతో ప్రపంచకప్ లోనే అతి తక్కువ స్కోరుకు భారత్ అవుట్ అయింది.
ఇద్దరూ పరుగులు చేయడంతో...
రోహిత్ శర్మ 87 పరుగులు చేయడంతో కొంత స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు, సిక్సర్ బాదడంతో ఆమాత్రమైనా స్కోరు చేయగలిగారు. వరల్డ్ కప్ లో ఇది చాలా తక్కువ స్కోరు భారత్ చేసిందనే చెప్పాలి. మరి బౌలర్లు రాణిస్తే ఇంగ్లండ్ ను కంట్రోల్ చేయవచ్చు. లేదంటే ఈ మ్యాచ్ పై ఆశలు వదులుకున్నట్లే. భారత్ ఈ వరల్డ్ కప్ అతి హీన స్థాయిలో ఆడిన మ్యాచ్ లలో ఇది ఒక్కటే. వరసగా ఐదు విజయాలను సాధించిన టీం ఇండియా ఆరో మ్యాచ్ లో మాత్రం పెద్దగా రాణించలేదు.