World Cup 2023 : ఇండియాకు తిరుగులేదు.. నేరుగా సెమీస్ కే

శ్రీలంకపై భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్ కప్ లో భారత్ కు ఇది అద్భుతమైన విజయం

Update: 2023-11-02 15:06 GMT

శ్రీలంక పై భారత్అద్భుతమైన విజయం సాధించింది. 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. నేరుగా సెమీస్ కు చేరుకుంది.వరల్డ్ కప్ లో టీం ఇండియా దెబ్బకు ప్రత్యర్థులు కుదేలైపోతున్నారు. ఏ జట్టు కూడా ఇండియా ముందు నిలవలేకపోతుంది. ఇప్పటి వరకూ ఏడు వరస మ్యాచ్ లలో విజయం సాధించిన టీం ఇండియా పథ్నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్ కప్ లో భారత్ కు ఇది అద్భుతమైన విజయం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు చూసినట్లే లేదు. శ్రీలంక ఈ వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శన కనపర్చింది. అయితే కొద్దో గొప్పో భారత్ మీద తగినంత స్కోరు చేస్తుందనుకుంటే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక సెమి ఫైనల్ రేసు నుంచి తప్పుకోగా, భారత్ కాలరెగరేసి మరీ సెమీ ఫైనల్ కు చేరుకుంది. 302 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని చవి చూసింది.

భారీ విజయంతో...
శ్రీలంకతో ఇండియా మ్యాచ్ నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కు రుచించలేదు. అసలు మ్యాచ్ జరిగినట్లే అనిపించలేదు. ఇంత త్వరగా మ్యాచ్ అయిపోతుందని కూడా ఊహించి ఉండరు. ముంబయిలోని వాంఖడే స్టేడియం మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 357 పరుగులు చేసింది. విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ లు తృటిలో సెంచరీ మిస్ అయ్యారు. సెంచరీకి దగ్గరగా వచ్చి అవుటయ్యారు. చివరలో జడేజా విజృంభించి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లను బుమ్రా, సిరాజ్, షమి చావు దెబ్బ తీశారు. ఒక్క పరుగు తీయడం కూడా శ్రీలంక బ్యాటర్ కు కష్టంగా మారిందంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు.
వరస వికెట్లు తీసి...
17 పరుగులకు ఆరు వికెట్లు అంటే ఆ జట్టు పరిస్థితి ఏంటో చెప్పకనే తెలుస్తుంది. దీంతో శ్రీలంకపై భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. షమి ఐదు వికెట్లు నేలకూల్చాడు. బుమ్రా, జడేజాలు తలా ఒక వికెట్ తీసి వెన్ను విరిచాడు. దీంతో శ్రీలంక టాప్ ఆర్డర్ మొత్తం కుప్ప కూలిపోయింది. చివరకు ఏదో ఆడామని ఆడారు తప్ప ఏ బౌల్ ను కొట్టే ప్రయత్నం చేయలలేకోపోయారు. పెద్దగా కష్టపడకు దీంతో భారత్ విజయం పన్నెండు ఓవర్లకే కన్ఫర్మ్ అయిపోయింది. ఏ బ్యాటరూ ఇరవైకి మించి పరుగులు చేయకపోవడం విశేషం. వరస బెట్టి పెవిలియన్ బాట పడుతూనే ఉన్నారు. లంక ఇంత బలహీనమైన జట్టా అన్న అనుమానాన్ని వరల్డ్ కప్ ద్వారా మరోసారి అందరికీ అనిపించేలా ఆడారు. ఇరవై ఓవర్లలలోనే మ్చాచ్ ముగిసింది. 
వరసగా గెలిచి...
ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్ లను గెలిచింది. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్టుపై భారత్ విజయం సాధించింది. ఇక సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ పై గెలవాల్సి ఉంది. వరస విజయాలతో భారత్ ఊపు మీదుండగా మిగిలిన జట్లు మాత్రం అన్నీ పరాజయంతో పట్టికలో కిందకు పైకి ఎగబాకుతున్నాయి. కానీ భారత్ మాత్రం వరస విజయాలను అందుకుంటూ వరల్డ్ కప్ ను అందుకునేందుకు చేరువలో ఉంది. సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ లలో కూడా భారత్ గెలిచిందంటే వరల్డ్ కప్ లో రోహిత్ సేన సరికొత్త రికార్డు సృష్టించినట్లే. మిగిలన రెండు మ్యాచ్ లు కూడా భారత్ ఖాతాలో పడాలని ఆశిద్దాం.


Tags:    

Similar News