T20 World Cup 2024 : చిన్న దేశమైనా అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఏమరుపాటుగా ఉంటే మాత్రం?
ఈరోజు టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఐర్లాండ్ తొ జరిగే మ్యాచ్ తో ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ కు సిద్ధమవుతుంది
ఈరోజు టీ20 వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈరోజు ఐర్లాండ్ లో జరిగే మ్యాచ్ తో ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ కు సిద్ధమవుతుంది. న్యూయార్క్ లో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ ఐర్లాండ్ ను తక్కువగా అంచనా వేస్తే అభాసుపాలయ్యే అవకాశముంది. తొలి మ్యాచ్ కావడంతో ఆచితూచి ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ వంటి చిన్న దేశమని భావిస్తే రిజల్ట్ తిరగబడే అవకాశముంది.
సంచనాలకు...
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ జట్టు బలంగానే కనిపిస్తుంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ ఐర్లాండ్ తో ఆషామాషీ కాదు. ఐర్లాండ్ అనేక మ్యాచ్ లలో సంచలనాలను సృష్టించింది. అందుకే ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకోకుండా రన్ రేట్ ఎక్కువగా ఉండేలా చూసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని క్రీడానిపుణులు సూచిస్తున్నారు. ఐర్లాండ్ ను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడాల్సిన బాధ్యత టీం ఇండియాపై ఉందన్నది మాత్రం వాస్తవం.